వాకింగ్‌కు వెళ్తున్నానని భవనంపైకెక్కి దూకేశారు... జయసుధ భర్త సూసైడ్‌కు ముందు...

బుధవారం, 15 మార్చి 2017 (14:58 IST)
తెలుగు సీనియర్ హీరోయిన్, సహజ నటి జయసుధ భర్త, దర్శకనిర్మాత నితిన్ కుమార్ ముంబైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన ఆరు అంతస్తుల భవనం నుంచి కిందికి దూకి చనిపోయారు. అయితే, ఆయన ఆత్మహత్యకు చేసుకునేందుకు ముందు కొన్ని నిమిషాలకు ముందు ఏం జరిగిందనే విషయంపై అపార్ట్‌మెంట్‌ వాసి ఒకరు వివరించాడు. 
 
ఆ వ్యక్తి మాట్లాడుతూ ఎప్పుడూ టెరాస్‌కు లాక్ వేసే ఉంటుందని చెప్పాడు. మంగళవారం నితిన్ తనకు కనిపించారని, నవ్వుతూ పలకరించారని కూడా ఆ అపార్ట్‌మెంట్ వాసి తెలిపాడు. అయితే కొద్దిసేపటికి తాను ఇంట్లోకి వెళ్లానని, ఇంతలో బయట కేకలు, ఏడుపులు వినిపించాయని చెప్పాడు. 
 
ఏం జరిగిందో చూడగా నితిన్ కపూర్ రక్తపుమడుగులో కనిపించారని తెలిపాడు. లాక్‌ను పగలగొట్టి టెరాస్ డోర్‌ను ఓపెన్ చేసినట్టు గుర్తించినట్టు చెప్పారు. కాగా, కింద పడిన నితిన్ కపూర్ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి