గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌: మొక్కలు నాటిన జార్జి రెడ్డి మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి

శుక్రవారం, 26 జూన్ 2020 (14:46 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు కోంపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటిన జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్ ను చేపట్టారని దీనివలన పచ్చదనం పెరిగి కాలుష్యం తగ్గుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్, క్రిష్, హీరో నితిన్, సందీప్ కృష్ణ, తిరువీరులను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు