విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్‌ని సొంత చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ: ‘‘జార్జిరెడ్డిని తెరమీద పరిచయం చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. విద్యార్ధుల నుండి, ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నేను ఊహించిన దాని కంటే చాలా బాగుంది. జార్జిరెడ్డి పేరు ఇప్పుడు దేశంలో వినపడుతుంది. ఆయన చరిత్ర గురించి ఒకటిన్నర సంవత్సరాలు అధ్యయనం చేసి కథను రెడీ చేసుకున్నాను.
నేను కలిసిన వారందరూ చెప్పిన కథలలో చాలా వ్యత్యాసాలు చూసాను. కలిసిన ప్రతి ఒక్కరి దగ్గరా ఒక కథ ఉంది. అందుకే నేను నమ్మిన కథను చరిత్రలోని వాస్తవ సంఘటలను ఆధారంగా తీసుకొని జార్జిరెడ్డిని ప్రజెంట్ చేసాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మేం మొదటి నుండి అనుకోలేదు. ఎందుకంటే జార్జిరెడ్డి కథే చాలా కాంప్లికేటడ్. దాన్ని సినిమాగా మలిచేందుకు రాసుకునే ప్రతి అక్షరం విషయంలో నేను చాలా జాగ్రత్త పడ్డాను.
మళ్ళీ ఈ సినిమా మూలంగా ఎలాంటి ఘర్షణనలు రాకూడదని జాగ్రత్తపడ్డాను. కానీ జార్జిరెడ్డి వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ వంటి లక్షణాలతో కథను ముందుకు తీసుకెళ్లాను. జార్జిరెడ్డి కథకు హీరోలు అవసరం లేదు అని బలంగా నమ్మాను. నా స్నేహితుడు సందీప్‌లో జార్జి రెడ్డిని చూసాను. ఇప్పుడు అందరికీ జార్జిరెడ్డి సందీప్‌లో కనపడుతున్నాడు.
సినిమా హాల్స్‌లో వినపడుతున్న విజిల్స్, ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నాకు చాలా సంతృప్తినిస్తుంది. తెర మీద జార్జిరెడ్డి కథను నిజాయితీగా చెప్పాను అనే సంతృప్తి నాకు ఉంది. ఆయన జీవితాన్ని ఇప్పటి యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసాను. బ్లేడ్ ఫైట్, ఫైర్ వాల్ ఫైట్ యూత్‌కి విపరీతంగా నచ్చుతున్నాయి. జార్జిరెడ్డి గురించి చర్చ యూత్‌లో మొదలైంది. జార్జిరెడ్డి యూత్‌కి కనెక్ట్ అయ్యాడు. అది చాలు నాకు’’ అన్నారు.