"జిగేల్ రాణి" డ్యాన్స్‌మాస్టర్ జానీ మాస్టర్‌కు జైలుశిక్ష

గురువారం, 28 మార్చి 2019 (11:29 IST)
టాలీవుడ్‌లో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ కొరియోగ్రాఫర్‌లలో జానీ మాస్ట‌ర్ కూడా ఒక‌రు. టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల‌ సినిమాలకు సైతం కొరియోగ్రఫీ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్టార్‌డమ్‌ని సృష్టించేసుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు జైలుకు వెళ్లబోతున్నారు. 
 
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల సినీ ఇండస్ట్రీలలో ఉన్న అగ్రహీరోలకు కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న జానీ మాస్టర్.. 2015వ సంవత్సరంలో ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. 2015వ సంవత్సరంలో 354, 324, 506 సెక్ష‌న్‌ల క్రింద జానీ మాస్ట‌ర్‌పై కేసు నమోదు కాగా.. ఇన్నాళ్ల‌కు దీనిపై తుది తీర్పు వెలువడింది. 
 
ఈ తీర్పు వెలువరించిన మేడ్చ‌ల్ కోర్ట్ సెక్ష‌న్ 354 కేసుని కొట్టివేసి... 324, 506 సెక్ష‌న్స్ మాత్రం నిజ‌మేనని నిర్థారిస్తూ... ఆయ‌న‌కు 6 నెలల శిక్షని విధించింది. ఈ కేసులో జానీ మాస్టర్‌తో పాటు మ‌రో ఐదుగురిని కూడా జైలుకు త‌ర‌లించవలసిందిగా మేడ్చ‌ల్ కోర్ట్ ఆదేశించింది. కాగా, గత యేడాది విడుదలైన రంగస్థలం చిత్రంలోని పాటల్లో అత్యంత ప్రజాధారణ పొందిన జిగేల్ రాణి పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసింది కూడా జానీ మాస్టరే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు