రంగస్ధలం సినిమాలో జిగేలు రాణి ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పనవసరం లేదు. జిగేలు రాణిగా ఐటం సాంగ్ చేసిన పూజా హెగ్డేకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ పాట పాడిన గాయనికి మాత్రం అన్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సామాజిక, ప్రసార మాథ్యమాల్లో ప్రచారం జరిగింది. వెంకటలక్ష్మి అనే నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ఆ పాటను పాడింది. అయితే మధ్యవర్తులు ఆమెకు డబ్బులివ్వకుండా మోసం చేశారు. దీంతో వెంకటలక్ష్మి తన ఆవేదనను సామాజిక మాథ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసింది.
వారంరోజుల పాటు వెంకటలక్ష్మి ఆవేదన వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా సినిమా దర్శకుడు సుకుమార్‌తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లు చూశారు. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న సుకుమార్ మధ్యవర్తిని పిలిపించి ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించారు. ఆ తరువాత వెంకటలక్ష్మి బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను కనుక్కుని నేరుగా ఆమె అకౌంట్‌లోకి డబ్బులు పంపారు.