2016లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయిన... ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ''జనతా గ్యారేజ్''. అయితే ఇప్పటికీ జనతా గ్యారేజ్ రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా, గ్యారేజ్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చిపడింది. 2016లో ఎక్కువ మంది తిలకించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. టీవీలో అత్యధిక మంది చూసిన చిత్రంగా జనతా గ్యారేజ్ రికార్డ్ సృష్టించిందని టీవీ ఆడియన్స్ మోనటిరింగ్ ఏజెన్సీ (బీఏఆర్‌సి) ఇండియా ప్రకటించింది.