'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు
ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది..
రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు'
అని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుస్తున్నారు. ఈయన హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ఆగస్టు నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేసే టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.
కట్ చేస్తే.. అదే లెక్చరర్ హాట్ సీట్‌లో తారక్ ఎదురుగా కూర్చుని పాతిక లక్షలు గెలుచుకుంటాడు. ఈ డబ్బునేం చేస్తారని సదరు లెక్చరర్‌ని తారక్ అడిగితే.. ఫీజులు కట్టలేని మా స్టూడెంట్స్‌కు ఇందులోని సగం డబ్బులతో ఫీజు కట్టేస్తానని, మిగిలిన సగం డబ్బులు వాడుకుంటానని చెప్పడంతో తారక్ లెక్చరర్‌ను అభినందిస్తాడు.