స్కిన్ షోలో కాంప్రమైజ్ కాని రుహానీ శర్మ - హాట్ లుక్‌తో పిచ్చెక్కిస్తోంది...

ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:56 IST)
అరచేతిలో ప్రపంచం (సోషల్ మీడియా) అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రిటీలు మరింతగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్లు మరీ విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
 
తాజాగా రుహాని శ‌ర్మ సెక్సీ లుక్‌లో క‌నిపించి నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి "చిలసౌ"తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత "విశ్వక్ సేన్'' హిట్ చిత్రంలో క‌నిపించింది. 
 
ఈ చిత్రం స‌క్సెస్ కావ‌డంతో అమ్మ‌డికి ఆఫ‌ర్స్ వెల్లువలా వ‌స్తున్నాయి. అయితే మొద‌ట్లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన రుహానీ గేర్ మార్చింది. మెల్ల మెల్లగా స్కిన్ షోకు సిద్దం అవుతోంది. "డర్టీ హరి'' సినిమాలో రుహాని శర్మ పాత్రకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి.
 
ప్రస్తుతం తెలుగులో "నూటొక్క జిల్లాల అందగాడు" సినిమాను చేస్తోంది. అయితే ఈ అమ్మ‌డు స్కిన్ షో విషయంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేయ‌గా, అది చూసిన యువ‌త త‌న్మ‌య‌త్వంలో మునిగి తేలుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు