సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కాలా" చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముంబైలోని ఓ మురికివాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో 'చిట్టమ్మా' అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇందులో రజినీకాంత్, హుమా ఖురేషీల ప్రేమ ట్రాక్ చూపించారు.
తరతరాలుగా తాము బతుకుతున్న ప్రాంతాన్ని కార్పొరేట్‌పరంగాకాకుండా కాపాడుకోవడానికి రాజకీయ శక్తులపై పోరాటం సాగించిన ఓ మురికివాడ నాయకుడి కథ 'కాలా' చిత్రం. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకొని దానికి రజినీకాంత్ ఇమేజ్, మాస్ హంగులను జోడించి ఈ కథను నడిపించారు దర్శకుడు పా.రంజిత్. సంతోష్ నారాయణ్ బాణీలు సమకూర్చగా చిట్టమ్మా అనే పాటని అనంతు, శ్వేతా మోహన్ కలిసి పాడారు. ఆ వీడియో సాంగ్‌ను మీరూ ఓసారి తిలకించండి.