చెన్నైలో "కాలా" ప్రకంపనలు.. 'మెర్సల్' రికార్డు గల్లంతు

శుక్రవారం, 8 జూన్ 2018 (13:05 IST)
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కర్ణాటకలో మాత్రం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుని పూర్తిస్థాయి విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం చెన్నై మహానగరంలో కలెక్షన్లపరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కరికాలన్ దెబ్బకు గతంలో విడుద‌లైన త‌మిళ సినిమా రికార్డుల‌న్నీ బద్ధలైపోయాయి.
 
త‌మిళనాట ర‌జినీకాంత్‌కి భారీ క్రేజ్ ఉన్న నేప‌థ్యంలో కాలా చిత్రం చెన్నై సిటిలో తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫిల్మీ ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తొలిరోజున ఈ చిత్రం చెన్నైలో రూ.1.76 కోట్ల గ్రాస్ రాబట్టి గతంలో విజయ్ సినిమా 'మెర్సల్' పేరు మీదున్న రూ.1.52 కోట్ల రికార్డుని తిరగరాసింది. ఫలితంగా తొలి స్థానంలో నిలువగా, మెర్సల్ ద్వితీయ స్థానానికి దిగజారింది. 
 
అలాగే, రూ.1.21 కోట్ల‌తో 'వివేగం' మూడో స్థానంలో ఉండ‌గా, రూ.1.12 కోట్ల‌తో "క‌బాలి" నాలుగో స్థానంలో, రూ 1.05 కోట్ల‌తో "థేరీ" ఐదో స్థానంలో ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం కాలా చిత్రం క‌బాలి అంత వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేకపోయింది. మురికి వాడ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన కాలా చిత్రం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కగా, హుమా ఖురేషీ, ఈశ్వ‌రీ రావు హీరోయిన్లుగా నటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు