తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కబాలి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు వేయి కనులతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆడియోను ముందుగా జూన్ 9న రిలీజ్ చేయాలనుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే జూన్ 11వ తేదీన గ్యాంగ్‌స్టర్ డ్రామా కబాలి ఆడియో ఉంటుందని తెలుస్తోంది. అమెరికా నుంచి రజినీకాంత్ తిరిగొచ్చాక ఈ ఆడియోను జూన్ 11న రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.
చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో ఈ వేడుక అట్టహాసంగా జరుగనుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. 32, 60 ఏళ్ల లుక్‌తో రెండు అవతారాల్లో రజినీ కాంత్ కనిపిస్తారు. రాధికా ఆప్టే, దినేష్, ధన్సిక, కిషోర్, కలైయరసన్, తైవాన్ స్టార్ విన్స్‌స్టన్ చావో నటిస్తున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది.