కాజల్‌ అగర్వాల్ విడుదల చేసిన 'ఒక్కడొచ్చాడు' టీజర్‌

శనివారం, 22 అక్టోబరు 2016 (19:14 IST)
విశాల్‌, తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. సురాజ్‌ దర్శకుడు. 
 
నవంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం యొక్క టీజర్‌ను హీరోయిన్‌ కాజల్‌ శుక్రవారం సాయంత్రం చెన్నైలో 6 గంటలకు విడుదల చేసింది.  నవంబర్‌ మొదటి వారంలో ఆడియో, నవంబర్‌లోనే సినిమా కూడా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి