పెళ్లి తేదీని వెల్లడించిన 'చందమామ' (video)

మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:25 IST)
టాలీవుడ్ చందమామ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తన వివాహ తేదీని కూడా కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ స్వయంగా ప్రకటించింది. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోనున్నట్టు అధికారికంగా ఆమె ధృవీకరిస్తూ, తన పెళ్లి తేదీని కూడా వెల్లడించింది. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 
 
'నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని చాలా సంతోషంతో చెబుతున్నాను. మా దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. ఈ కరోనా మహమ్మారి మన సంబరాలను పూర్తిస్థాయిలో జరుపుకోనివ్వకుండా చేసింది' అని ఆమె ట్వీట్ చేసింది.
 
'అయినప్పటికీ, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు మేము చాలా థ్రిల్‌గా భావిస్తున్నాము. మీరు కూడా ఇదే తీరుతో మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ పట్ల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 
 
ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. ఇకపై కూడా నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాను' అని కాజల్ ట్వీట్ చేసింది.

 

pic.twitter.com/3qjCX9hAe1

— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు