థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ సత్యభామ

డీవీ

గురువారం, 23 మే 2024 (17:35 IST)
Kajal Aggarwal
'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా జూన్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ లతో పాటు ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. మహిళలు చూడాల్సిన సినిమా ఇదంటూ హీరోయిన్ కాజల్ ప్రమోషన్స్ లో చెప్పిన మాటలు ప్రభావం చూపిస్తున్నాయి. లేడీ ఆడియెన్స్ “సత్యభామ” కోసం వెయిట్ చేస్తున్నారు.
 
 “సత్యభామ”లో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.  “సత్యభామ” నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు ఈ చిత్ర ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు