బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

డీవీ

గురువారం, 23 మే 2024 (08:12 IST)
kalki vehical Bujji prabhas
కల్కి 2898 AD’లో ఫ్యూచరిస్టిక్ వెహికల్ పరిచయం కార్యక్రమం రామోజీ రావుగారి కోడలు విజయేశ్వరి, వారి పిల్లలు, క్రిష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి వారి పిల్లలు, అశ్వనీదత్ కుటుంబంతోపాటు జాతీయ మీడియా, అభిమానుల సమక్షంలో నిన్న రాత్రి రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్ గా జరిగింది.

Vijayeswari, Shyamala Devi
‘కల్కి 2898 AD’లో ఫ్యూచరిస్టిక్ వెహికల్, నా  బెస్ట్ ఫ్రెండ్ అని  ప్రభాస్ తెలియజేశారు. హైదరాబాద్ ఫిలింసిటీలో నిన్న రాత్రి జరిగిన బుజ్జి ఇంట్రడక్షన్ ను ఆయన పరిచయం చేశారు. ఫిలింసిటీలో బాహుబలి మాహిష్మతిసామ్రాజ్యం సెట్ నే కల్కి సెట్ గా మార్చారు. పలువురు ఇంజనీర్లు మేథోసంపత్తితో తయారైన ఈ బుజ్జి (మిషన్)ను ఎలా తయారుచేశారో అనే వీడియోను బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించారు.
 
Vijayeswari, aswanidath
కల్కి 2898 AD’లో ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ అయిన కారు, బైక్ లు, బుజ్జిని పరిచయం చేశారు. కారును తయారుచేయడానికి ఇరవై ఐదు మంది ఇంజనీర్లు పనిచేశారు. వారిని కూడా పరిచయం చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను యాభై సెకన్లు మాత్రమే చూపించారు. వెంటనే ప్రభాస్.. మూడేళ్ళు కష్టపడిన దానికి కేవలం యాభై సెకన్లా? అంటూ పక్కనే వున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ను అడగగా. మరోసారి కారు, బుజ్జిని తయారుచేసే విధానాన్ని ఇంజనీర్లు పనిచేసిన ప్రోమోను మరోసారి చూపించారు. 
 
ఈ ఈవెంట్ ను రెజ్లింగ్ ఫోటీలు, రాజులకాలంలో మల్లయుద్ధాలు జరిగేటప్పుడు ఏర్పాటు చేసే విధంగా మైదానం చుట్టూ ఇనుప వలయాలు, ఆ పక్కన ప్రజలు తిలకించేందుకు స్టేజీలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు జాతీయ మీడియా ను కూడా పిలిపించారు. అయితే కారు రేసింగ్ లా ఈ ప్రోగ్రామ్ వుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు