జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, లెజెండ్ కమల్ హాసన్ సీఎం అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని.. ఆయనకు అధికారం దక్కదన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకే రారని జోస్యం చెప్పారు.
ఇక ప్రస్తుతం పలుకుబడి ఉన్న నేతల్లో సీఎం కాగల అవకాశం ఎవరికి ఉందన్న ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్భుమణి రాందాస్ పేరు చెప్పారు. వచ్చే నెల 7వ తేదీన కమల్ హాసన్ తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని వార్తలు వస్తున్న వేళ, సొంత సోదరుడికే నమ్మకం కలిగించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.