విశ్వనటుడు కమల్ హాసన్, యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన "విక్రమ్" చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. వందేళ్ళ తమిళ చిత్రపరిశ్రమలో అత్యధిక మంది ప్రేక్షకులు థియేటర్‌లో వీక్షించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉంటే తాజాగా 'విక్రమ్' సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. ఈ సినిమా కోయంబత్తూర్‌లోని కేజీ సినిమాస్ థియేటర్‌లో 113 రోజులు ప్రదర్శితమైంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమా నెల రోజులు థియేటర్‌లో ఆడితే అది గొప్ప విషయం. అలాంటి విక్రమ్ చిత్రం ఏకంగా 113 రోజులు ప్రదర్శితమయిందంటే ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.