కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

ఠాగూర్

బుధవారం, 28 మే 2025 (11:13 IST)
అగ్ర నటుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడం నుంచి తమిళం నుంచి పుట్టిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు, కర్నాటక రాజకీయ నేతలు మండిపడుతున్నారు. 
 
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన "థగ్ లైఫ్" చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో కమల్ హాసన్ పాల్గొని ప్రసంగించారు. ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈయనను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతూ, మీ భాష తమిళం నుంచే పుట్టింది అని అన్నారు. అందుకే ఉయిరే, ఉరవే తమిళే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాను. 
 
శివరాజ్ కుమార్ ఇక్కడకు వచ్చారంటే అక్కడ కూడా ఇది నా కుటుంబమే. అందుకే నా ప్రసంగాన్ని "ఉయిరే, ఉరవే తమిళే" అంటూ మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది, కాబట్టి మీరుకూడా అందులో భాగమే అని అన్నారు. 
 
కాగా, కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు కర్నాటకలో తీవ్ర దుమారం రేపాయి. కమల్ హాసన్ సంస్కారహీనంగా మాట్లాడారు అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప వ్యాఖ్యానించారు. కన్నడ భాషను అవమానించారని ఆరోపించారు. మాతృభాషను ప్రేమించాలి కానీ, మిగతా భాషలను అగౌరవపరచకూడదు అని ఆయన అన్నారు. కన్నడతో పాటు అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్ కన్నడను అవమానించడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. asa

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు