దేశంలో మీటూ ఉద్యమం ఊపందుకుంది. బాలీవుడ్‌ను ఈ ఉద్యమం కుదిపేస్తోంది. కొంతమంది తమను వేధించిన ప్రముఖుల పేర్లు కూడా బయటపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ స్టార్ హీరో హృతిక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. హృతిక్‌తో ఎవరూ కలిసి పనిచేయకూడదని కంగనా రనౌత్ విజ్ఞప్తి చేసింది. దర్శకుడు వికాస్ బాల్ గురించి వస్తున్న ఆరోపణలు నిజమేనని చెప్పింది.
వికాస్ బాల్ మాత్రమే కాదండోయ్.. మహిళలలను చులకనగా చేసేవాళ్లు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. తమ భార్యలను గౌరవ చిహ్నాలుగా ఇంట్లో ఉంచుకుని యవ్వనంలో ఉన్న మహిళలతో ప్రేమ కలాపాలు సాగించే వారందర్నీ శిక్షించాలని కంగనా రనౌత్ డిమాండ్ చేసింది. తాను హృతిక్ రోషన్ గురించే మాట్లాడుతున్నానని.. అతనితో కలిసి ఎవ్వరూ కలిసి పనిచేయకూడదని కంగనా తెలిపింది.
అలాగే వికాస్ గురించి వస్తున్న వార్తలు, అతడి లైంగిక వేధింపుల గురించి తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవం అని కంగనా రనౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. వికాస్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్లంతా పెద్ద మనుషుల ముసుగులో దాక్కుని ఉన్నారంటూ కంగనా పేర్కొంది.