'కన్నా నీ..' పాటను టాలెంటెడ్ మ్యుజీషియన్ సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్ తో కంపోజ్ చేశారు. 'కన్నా నీ..' పాట ఎలా ఉందో చూస్తే - ' కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే, అలలుగా తాకగానే, కరిగిపోనా నీలో, ప్రళయమై తాండవిస్తే, అలజడే నాలో ..' అంటూ గుండె లయనే అక్షరాలుగా మార్చిన లవ్ వైబ్రేషన్ తో సాగుతుందీ పాట.