VFX company Demi God Creatives team with Kiran Abbavaram
ఫన్ మోజీ అంటూ యూట్యూబ్‌లో అందరినీ నవ్వించే టీం ఇకపై సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అయింది. మన్వంతర మోషన్ పిక్ఛర్స్ మీద కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతోన్నారు. అంతే కాకుండా డెమీ గాడ్ క్రియేటివ్స్ అంటూ వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా ప్రారంభించనున్నారు. మన్వంతర మోషన్ పిక్చర్స్ అనే ఈ కొత్త ప్రొడక్షన్ కంపెనీలో ఆల్రెడీ ఓ సినిమాను ప్రారంభించినట్టుగా టీం తెలిపింది. ఈ క్రమంలో ఫన్ మోజీ టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ తరుపున సుశాంత్ మహాన్, హరీష్, సంతోష్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ మీడియాతో ముచ్చటించారు.