జూనియర్ శ్రీదేవి తెరంగేట్రం ఖరారైపోయింది. గతంలో శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్‌గా మహేష్‌బాబు-మణిరత్నం మూవీతో హీరోయిన్‌గా పరిచయం చేయాలని జోరుగా ప్రచారం సాగింది. ఇవి ప్రస్తుతం పుకార్లుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం శ్రీదేవి తన కూతురిని లాంఛ్ చేసే బాధ్యతని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ చేతిలో పెట్టిందట.
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో మహేష్ భట్ కూతురు ఆలియా భట్‌ని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన కరణ్.. అలియా భట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుండటంతో.. ఇదే తరహాలో తన కుమార్తె కూడా బిటౌన్‌లో మెరిసిపోవాలని శ్రీదేవి భావిస్తుందట. దీంతో జూనియర్ శ్రీదేవిని మరాఠీ రీమేక్ 'సైరత్'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టించాలని ప్లాన్ చేస్తున్నాడట కరణ్ జోహార్.