''యుగానికి ఒక్కడు'', ''నాపేరు శివ'', ''ఊపిరి'' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కార్తీ. ప్రస్తుతం ఈ హీరో ''కాష్మోరా'' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. నయనతార, శ్రీ దివ్య హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రత్న మహారాణిగా నయన్ కనిపించనుందట. చేతబడుల నేపథ్యంగా హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. గోకుల్ డైరెక్షన్‌లో పివిపి బ్యానర్‌పై దాదాపు రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మకుట సంస్థ గ్రాఫిక్స్ అందిస్తుండగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
ఓంప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. డార్క్ ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ మూడు పాత్రలు పోషిస్తున్నాడట. రాజ్య సైనిధికారుడు రాజ్ నాయక్, నేటితరం యువకుడు, రహస్యాన్ని చేధించే పాత్ర (దెయ్యంలా ఉంటుందని టాక్).. ఇలా ఈ మూడు రోల్స్‌లో కార్తీ కనిపించనున్నట్లు సినీ పండితులు అంటున్నారు. నిజానికి ఇందులో భిన్నమైన గెటప్‌ల కోసం ముందుగా 47 గెటప్‌లను తీర్చిదిద్దారట దర్శకులు.
దీనికోసం ఏకంగా ఏడు నెలలు కష్టపడి 47 గెటప్‌లు రూపొందించారు. ఇదిలావుండగా ఇందులో పీరియడ్ సన్నివేశాల కోసం చెన్నై శివారు వానగరం ప్రాంతంలో పెద్దఎత్తున రెండు దర్బార్ సెట్‌లను దర్శకనిర్మాతలు భారీ ఖర్చుతో వేయించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీ బిజీగా ఉన్న ఈ సినిమాని దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయనున్నారట.