రాయుడూ... వచ్చేశాడు. కాటమరాయుడు వచ్చేశాడు.. పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తొలి టీజర్ విడుదలైంది. పవన్ కల్యాణ్ నేపథ్యంలో కౌబాయ్ ట్యూన్‌తో ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు. ఎవడున్నాడన్నది ముఖ్యం అనే పంచ్ డైలాగ్‌తో పవన్ కల్యాణ్ తొలి టీజర్ అదరగొట్టింది. తన మార్కు లుంగీతో, కత్తివాదరలాంటి చూపుల్తో, తన వెనుక ఏదో జరగబోతోందన్న కుతూహలం కలిగిస్తూ కాటమరాయుడు వచ్చేశాడు.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో మరొక అద్భుతమైన మాస్ అప్పీలుతో పవన్ కల్యాణ్ టీజర్ సాక్షిగా సవాల్ చేస్తూ వచ్చాడు. అత్తారింటికి దారేది సినిమాలోని రన్ చేజ్ దృశ్యాలు, రైల్వే స్టేషన్‌లో హై వోల్టేజ్ డ్రామాతో కూడిన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ పవర్ స్టార్ 2017 బ్లాక్ బస్టర్ మూవీగా కాటమరాయుడు నిలిచి తీరుతుందన్న హామీ కల్పిస్తూ పవన్ వచ్చేశాడు.