తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న అందాల నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్‌తో పాటు దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 9వ తేదీన విడుదలకానుంది.
అయితే, ఈ చిత్ర కథకు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సినిమాలో సావిత్రి చివరి రోజులు కూడా చూపించరన్నది తాజా సమాచారం. చివరి రోజులలో సావిత్రి తన ఆస్థులని కోల్పోయి, మద్యానికి బాగా అలవాటై తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంది. తన పేరిట ఉన్న చాలా ఆస్థులు సీజ్ చేశారు.
కానీ వీటన్నింటిని మేకర్స్ సినిమాలో చూపించదలచుకోలేదట. సావిత్రి కుటుంబ సభ్యులు ఆమె ట్రాజిడీ స్టోరీ చూపించొద్దని ప్రాధేయపడటంతో వారు కూడా అందుకు ఓకే అన్నారట. కాకపోతే చివరి రోజులలో సావిత్రి చాలా బాధలకి గురైందని మాత్రం కార్డ్ ద్వారా చెప్తారని తెలుస్తుంది. మిక్కీ జేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.