తెలుగులో 'మహానటి'గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్... ఇపుడు గిరిగీసుకుని వర్క్ చేసింది. నో ఎక్స్‌పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచింది. సౌత్‌లో ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పిన 'మహానటి' ఉత్తరాదికి వెళ్లిపోయింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కీర్తి సురేష్ ఇపుడు గ్లామర్ డోర్స్ తెరిచింది.
పెళ్లి తర్వాత చేయలేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరోబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. 'బేబీ జాన్' డిజాస్టర్ బాలీవుడ్ కెరీర్ డైలామాలో పడేట్లుచేసింది. హిందీలో ఓ రామ్ కామ్ మూవీకి కమిటైనట్టు టాక్. ఇవేకాకుండా, తమిళంలో 'రివాల్వర్ రీటా', 'కన్నివీడి' చేస్తుంది. తెలుగులో "భోళా శంకర్" తర్వాత "కల్కి"కి బుజ్జికి వాయిద్ ఇచ్చింది. తప్ప మరో కొత్త సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు.