ఐస్ క్రీమ్ విక్రయదారుడు ఒకరు హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఆటపట్టించాడు. దానికి ఈ మలయాళ బ్యూటీ ఫన్నీగా కౌంటరిచ్చారు. ఎక్కడో విహారయాత్రలో ఉన్న కీర్తి సురేశ్.. ఓ ఐస్ క్రీమ్ దుకాణానికి వెళ్లారు. అక్కడ ఆ ఐస్ క్రీమ్ వెండర్ ఆటపట్టించారు. చివరకు ఎలాగో ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అయితే, కీర్తి సురేశ్ కూడా డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, ఇటూ ఇటూ తిప్పుతూ సదరు ఐస్ క్రీమ్ వెండర్‌ను ఆటపట్టించింది. చివరకు ఓ వెండర్ చటుక్కున చేయిపట్టుకోవడంతో కీర్తి డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి చిరునవ్వుతో వచ్చేసింది. వచ్చేముందు ఆమె ఐస్ క్రీమ్ వెండర్లతో ఓ సెల్ఫీ ఫోటో తీసుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.