''నేను శైలజ'' చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్.. సినిమాలు ఎంచుకోవడంలో చాలా సెలెక్టివ్‌గా ఎంపిక చేస్తుంది. తాజాగా తమిళనాట ఓ గోల్డెన్ ఆఫర్‌కు నో చెప్పిందట. ఎందుకో తెలుసా..? ఆ చిత్రంలో రెండు, మూడు సీన్స్‌లలో లిప్ లాక్ చేయాల్సి ఉందని తెలియడంతో సినిమా ఛాన్సును వదులుకుంది. ఈ మధ్య ఏ సినిమాలో చూసిన లిప్ లాక్‌లు, బికినీలు వేయడం ఇప్పుడు కామన్‌గా మారింది.
ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య భారీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో కథానాయికలు ఇలాంటివి చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ కీర్తి మాత్రం వీరిద్దరికి భిన్నంగా నడుచుకుంటుంది. ఈమెను చూసిన కొంతమంది దర్శక, నిర్మాతలు కెరీర్ మొదట్లో ఇలా బెట్టు చేయడం కామన్… ఏ అవకాశాలు రానప్పుడు వల్లే మెట్టు దిగుతారని అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని సరసన, అలాగే తమిళం సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందు కీర్తి సురేష్ నటించిన రజనీ మురుగన్.. కానుకగా విడుదలై భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.