మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ దశ తిరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక కమెడియన్ సరసన నటించడానికి సిద్ధం అవుతుందని టాక్ వస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం కమెడియన్ వడివేలు సరసన "నాయి శేఖర్ రిటర్న్స్" అనే సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని కొలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని, సినిమా కీలకంగా మారబోతోంది అని అందుకే ఇలాంటి పాత్ర చేయడానికి కీర్తి సురేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈమె వడివేలు సరసన హీరోయిగా కనిపిస్తారా లేక సినిమాలో కీలకపాత్ర పోషిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.