దేశ భక్తి లక్ష్యంతో కేశూ పనిచేశారని ఆయన వ్యక్తిత్వం, వ్యవహారంలో సౌమ్యత, నిర్ణయాలు తీసుకోవడంలో దృఢ నిశ్చయ శక్తి అచంచలమైందని ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కేశుభాయ్.. రైతులు, పేదల కష్టాలను అర్థం చేసుకునేవారన్నారు. కేశూజీ వివిధ హోదాల్లో తన నిర్ణయాలతో రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. రైతుల జీవితాలను సులభతరం చేశారన్నారు.