కేజీఎఫ్ సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ లాక్ రోజుకు రూ.35లు సంపాదిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ లాక్ డౌన్ టైమ్‌లో తన సొంత ఊరు వెళ్లి తన తండ్రితో పాటుగా దేవుళ్ళకు ఆభరణాలు తయారుచేసే పనిలో ఉన్నాడట. కేజీఎఫ్ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ లాక్ డౌన్ వల్ల తన సొంత ఊరు ఉడిపి దగ్గర కుందాపూర్ అట.
కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నా ఇలా తండ్రికి సాయపడుతూ 35 రూపాయలు సంపాదించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు రవి బస్రూర్. కేజీఎఫ్ సినిమాలో అతని మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హీరో ఎలివేటెడ్ సీన్స్‌లో బీజీఎమ్ అదిరిపోయింది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు.