'జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా! సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. ఈ సీడ్ మూవీస్‌లో కూడా ఫుల్ బోర్డు పెట్టాలా. ఆర్టీసీ రోడ్డు, బెజవాడ సర్కిల్ వార్డు.. తెలంగాణ మొత్తం వేచి చూడాలా.. దాయిదామ స్టెప్పు వేసి ఎన్నాళ్లైందో? ఈల వేసి, గోల చేసి ఎన్నాళ్లైందో..' అంటూ సాగే పాటను చిరంజీవి అభిమానులు ప్రత్యేకంగా రూపొందించారు.
చిరంజీవి చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. ఇది ఆయన అభిమానులకు అంకితం చేస్తూ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాట విడుదలై 24 గంటలు కాకముందే 70 వేల వ్యూస్ వచ్చాయి. 2311 మంది పాట నచ్చిందని లైక్ చేశారు. హేమచంద్ర ఆలపించిన ఈ పాటకు సత్యసాగర్ పొలం సంగీతం, సాహిత్యం అందించారు.