మిస్ కాకూడదని లైవ్ స్ట్రీమ్
అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 15 ఏళ్లుగా నేను నిర్మిస్తున్న ఆంజనేయస్వామి దేవాలయం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కుంబాభిషేకం సమారంభం జూలై- 01, 02న చెన్నైలో జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి మిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, భక్తాదులు, పెద్దలను పిలిచి చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడుండే కరోనా పరిస్థితుల వల్ల ఎవర్నీ ఆహ్వానించలేకపోతున్నాను. ఈ బృహత్తర సమారంభాన్ని ఎవరూ ఎవరూ మిస్ కాకూడదని లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన లింక్స్ జూలై-01,02న నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చూడొచ్చు. అందరూ అంజన్న కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అని ఓ వీడియోను అర్జున్ విడుదల చేశారు.