కర్నూలు కత్తివా, గుంటూరు మిర్చివా.. హన్సిక లైన్లో పెట్టేందుకు?

బుధవారం, 23 అక్టోబరు 2019 (12:50 IST)
సందీప్-హన్సిక జోడీగా దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న కామెడీ థ్రిల్లర్ -తెనాలి రామకృష్ణ బిఏబీఎల్. ఈ సినిమా నుంచి తాజాగా కర్నూలు కత్తివా.. గుంటూరు మిర్చివా అన్న లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 
 
కర్నూలు కత్తివా, గుంటూరు మిర్చివా, నన్నుకాస్త కనికరించవా.. కొండారెడ్డి బురుజువా, పుల్లారెడ్డి స్వీటువా, నోరూరిస్తూనే ఉంటావా -అంటూ హన్సికను సందీప్ పొగుడుతూ పాడిన పాట ఆసక్తికరంగా ఉంది. హన్సికను మెప్పించి లైన్‌లో పెట్టెందుకు సందీప్ కిషన్ ఆపసోపాలు పడుతున్నాడు. 
 
సాయికార్తీక్ సంగీతం సమకూర్చిన చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. పోసానీ కృష్ణమురళీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు