''లక్ష్మీ ఆటం బాంబ్'' వేసేసిన... ఆర్జీవీ (Video)

శుక్రవారం, 8 మార్చి 2019 (11:03 IST)
తెలుగు ప్రేక్షకులతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రైలర్ విడుదలైంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి సంబంధించిన రెండో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను గురించి ఆర్జీవీ ప్రస్తావిస్తూ స్వర్గం నుండి ఎన్టీఆర్ వేసిన లక్ష్మీ ఆటం బాంబ్‌గా అభివర్ణించాడు. 
 
ఎన్టీఆర్‌గా పి. విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతిగా యజ్ఞ శెట్టి, చంద్రబాబు నాయుడుగా శ్రీతేజ్ నటిస్తున్న... ఈ సినిమా మార్చి 22న విడుదల కానున్నట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో... జీవీ ఫిల్మ్స్, కంపెనీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
కాగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడం.. ఆ తరువాత జరిగే పరిణామాలతో వర్మ ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. సినిమాకు సంబంధించిన ఫోటోలు, పాటల టీజర్, ట్రైలర్లతో చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసారు వర్మ. మరి ఈ సినిమా ఎవరిని ఏ విధంగా ప్రభావితం చేయనుందో వేచి చూద్దాం..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు