''రంగా రంగ స్థలాన'' పాటకు వ్యూస్ వెల్లువ (video)

సోమవారం, 5 మార్చి 2018 (18:19 IST)
రంగస్థలం పాటలు నెట్టింట దుమ్మురేపుతున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం పాటలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. రంగా.. రంగ.. రంగస్థలాన.. అనే పాటను హోలీ సందర్భంగా సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఎంత సక్కగున్నావే సింగిల్ ట్రండ్‌తో రికార్డు సృష్టించింది.
 
ప్రస్తుతం ''రంగా రంగ స్థలాన'' అని సాగే టైటిల్ సాంగ్ కూడా సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదలైన ఈ పాట విడుదలైన గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ పాటకు లక్షల్లో లైక్స్ వచ్చాయి. 
 
ఈ పాటకు మాటలు చంద్రబోస్ అందించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం సినిమా చిత్రం మార్చి 30న విడుదల కానుంది. రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది పినిశెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు