మరి ఇలాంటి పండుగ సప్తసముద్రాలు దాటితే ఎలా ఉంటుంది. ఇదే ఆలోచన లండన్లో సెటిల్ అయినా మన తెలంగాణ అమ్మాయికి వచ్చింది. మన బతుకమ్మ పండగని లండన్ దేశస్థులకి పరిచయం చేసింది. స్వాతి రెడ్డి మన తెలంగాణ ఆడపడుచు. మెహబూబ్ నగర్ లో పుట్టి లండన్ లో సెటిల్ అయి, గాయనిగా మంచి పేరు తెచ్చుకోవాలని తనకు నచ్చిన పాటలు నిర్మించి పాడి లండన్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లండన్ లో జరిగే తెలుగు కార్యక్రమాలలో తాను ముందుంటారు.