ల‌వ్‌లో ప్రాబ్ల‌మా..? అయితే.. చైతు - సామ్‌ల‌ను అడ‌గండి..!

గురువారం, 14 మార్చి 2019 (22:26 IST)
అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ప్రేమ‌, పెళ్లి త‌దిత‌ర విష‌యాల గురించి మీరు ప్ర‌శ్న‌లు అడిగితే.. స‌మాధానం చెప్ప‌డానికి మేం రెడీ అంటూ చైత‌న్య‌, స‌మంత ట్వీట్ చేసారు. నెటిజనులు తమ ప్రశ్నలను #AskChaySam అనే హ్యాష్ టాగ్‌ను జోడించి అడిగితే సమంతా.. చైతు ప్రమోషన్స్ సమయంలో జవాబిస్తారట‌.
 
కాలం మారింది. అందుచేత సినిమాకి జ‌నాన్ని ర‌ప్పించ‌డం కోసం వైవిధ్యంగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇలా వైవిధ్యంగా ప్ర‌మోష‌న్స్ చేయ‌డంలో స‌మంత ఎప్పుడూ ముందుంటుంది. మ‌జిలీ సినిమాకి కూడా స‌రికొత్త‌గా ప్ర‌మోష‌న్స్ చేస్తూ ప్రేక్ష‌కుల్లో ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తున్నారు. 
 
దీంతో అభిమానులు మాత్ర‌మే కాకుండా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేట‌ర్స్‌లోకి వ‌స్తుందా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. మ‌రి.. ఏప్రిల్ 5న మ‌జిలీ రిలీజ్ కానుంది. ఈ డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్స్ ఎంతవ‌ర‌కు హెల్ప్ అవుతాయో.. ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు