ప్రముఖ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్‌స్టోరీ' సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. రిలీజ్ డేట్‌ని కూడా ఫిక్స్ చేసారని, జూలై 23న లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ విషయంపై నిర్మాత నారాయణ దాస్ నారంగ్ పరోక్షంగా స్పందించారు. జూలై 23న తమ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ 24న వెంకటేశ్ 'నారప్ప'ఓటీటీలో రాబోతుందని తెలియడంతో కాస్త ఆలోచనలో పడ్డామని తెలిపారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో థియేటర్లు మొదలుకానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ చిత్రాన్ని కూడా జూలై నెలలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి థర్డ్ వేవ్ ప్రమాదం ఉండడంతో నిజంగానే నిర్మాత ప్రకటించిన తేదీ కి ఈ సినిమా విడుదల అవుతుందా అన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి.