దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ యూ రామ్' రోపొందుతోంది. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ వీడియోతో పాటు ఉండాలని ఉందీ నీతో పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.