'మాటే వినదుగా' అంటున్న విజయ్ దేవరకొండ

శుక్రవారం, 26 అక్టోబరు 2018 (18:23 IST)
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం టాక్సీవాలా. ఈ చిత్రం ద్వారా హిట్ సాధించాలన్న భావనలో ఆయన ఉన్నాడు. జిఏ2 పిక్చ‌ర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
 
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని నవంబర్ 16న విడుదలకు సిద్దమైందీ చిత్రం. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని 'మాటే వినదుగా' లిరికల్ సాంగ్ విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యువతకు బాగా కనెక్ట్ అవుతూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.
 
కాగా, కెరీర్ పరంగా వినూత్న రీతిలో సాగిపోతున్న ఈయన ఇటీవలే 'గీత గోవిందం' రూపంలో బ్లాక్‌బస్టర్ సాధించి.. 'నోటా'తో అనుకున్న ఫలితం రాబట్టలేక పోయాడు. ఇక తన తాజా సినిమా 'టాక్సీవాలా'తో మరోసారి తనలోని టాలెంట్‌ను నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు