తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. ఆస్తి పన్ను చెల్లించని పక్షంలో అపరాధం విధించాల్సి ఉంటుందని తెలిపింది. అసలు రజినీకాంత్‌ను హైకోర్టు మందలించడం ఏమిటనే కదా మీ సందేహం. అయితే, ఈ వివరాల్లోకి వెళదాం...
ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కల్యాణమంటపాన్ని మూసి ఉంచామని... అప్పటి నుంచి దాన్నుంచి తనకు ఎలాంటి ఆదాయం లేదని, కార్పొరేషన్ విధించిన పన్నును తాను చెల్లించలేనని పిటిషన్‌లో రజనీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి శాంతి, వారికి కొంత సమయం ఇచ్చారు.
గతంలో కూడా ఆయన సతీమణి లతా రజినీకాంత్ ఆధ్వర్యంలో నడిచే ది ఆశ్రం స్కూల్స్ భవనాలకు కూడా అద్దె చెల్లించక పోవడంతో ఆ భవనాల యజమాని హైకోర్టు ఆశ్రయించగా, కోర్టు చీవాట్లు పెట్టి, తక్షణం అద్దె చెల్లించాలని ఆదేశించిన విషయం తెల్సిందే.