గణపతి నిమజ్జనంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ సందడి చేశాడు. హైదరాబాదులో గణపతి నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గణపతిని పూజించి, విగ్రహాలను నిమజ్జన ఘట్టం వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా గణపతి బొప్పా మోర్యా అంటూ సందడి చేశాడు. తన ఇంట్లో ప్రతిష్టించుకొన్న వినాయకుణ్ణి నిమజ్జనం చేశాడు.