అడవి శేష్ హీరోగా వచ్చిన చిత్రం మేజర్. ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా సేవలు అందిస్తూ వీరమరణం పొందిన ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలపై మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా, ప్రతి ఒక్క సినీ సెలెబ్రిటీల మనస్సులను కదిలిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ చిత్రాన్ని చూసి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఇందుకోసం పాఠశాల యాజమాన్యాలు కోరితో విద్యార్థుల కోసం ప్రత్యేక షోలు వేస్తామని, అందుకోసం majorscreening@gmail.com కు మెయిల్ చేసి ఈ అవకాశాన్ని పొందవచ్చని ఆయన కోరారు. ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపారు.