మలయాళ నటి అపర్ణ నాయర్ ఉరేసుకుని ఆత్మహత్య

శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (13:20 IST)
Aparna Nair
మలయాళ సినీ-సీరియల్ నటి అపర్ణ నాయర్ తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మలయాళంలో కొన్ని సినిమాలు, అనేక సీరియల్స్‌లో నటించిన 33 ఏళ్ల ఈ హీరోయిన్, గత రాత్రి కరమన సమీపంలోని తన నివాసంలో తన గదిలో ఉరివేసుకుని కనిపించిందని పోలీసులు తెలిపారు.
 
అపర్ణ తన భర్త, పిల్లలతో కలిసి ఉంటోందని పోలీసులు తెలిపారు. అయితే ఏమైందో ఏమో కానీ  గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
అసహజ మరణంగా కేసు నమోదు చేసామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలాగే వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని.. ఆమెది ఆత్మహత్యేనని, కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు