నేను నా కొలీగ్‌కు పూర్తి మద్దతిస్తా : రియాకు మంచు లక్ష్మి సపోర్టు (Video)
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (14:14 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే, అందరి దృష్టి బాలీవుడ్ హీరోయిన్, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపైనే కేంద్రీకృతమైవుంది. ఈ క్రమంలో ఆమెను సీబీఐ పలుమార్లు విచారించింది.
ఈ నేపథ్యంలో రియా మీడియా ముందుకు వచ్చి ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేసాయ్‌తో ఇంటర్వ్యూలో పాల్గొంది. తనతో పాటు సుశాంత్‌కి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత రియాకి కాస్త మద్దతు పెరగడంతో పాటు #JusticeForRheaChakraborty అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
అయితే ఈ వివాదంపై మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ #JusticeForSushanthSinghRajput , #JusticeForRheaChakraborty అంటూ పోస్ట్ పెట్టింది.
ఇందులో "రియా-రాజ్‌దీప్ సర్ధేసాయ్‌ల పూర్తి ఇంటర్వ్యూ నేను చూశాను. దీనిపై స్పందించాలా వద్దా అనే దాని గురించి చాలా ఆలోచించా. ఈ విషయంలో ఒక అమ్మాయిని మీడియా రాక్షసిగా చేయడం బాధగా ఉంది. నాకు నిజం తెలియదు. సత్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం నిజాయితీగా బయటకు వస్తుందని భావిస్తున్నాను.
న్యాయ వ్యవస్థపై మరియు సుశాంత్‌కు న్యాయం చేయడంలో పాలుపంచుకున్న అన్ని ఏజెన్సీలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం తెలియకుండా ఓ వ్యక్తిని, ఆమె కుటుంబం మొత్తాన్ని కించపరచకుండా ఉండొచ్చు. మన స్వరం వినిపించాల్సి వచ్చినప్పుడు హార్ట్‌ఫుల్‌గా మాట్లాడకపోతే మనం ఎలా ప్రామాణికం అవుతాము. నేను నా కొలీగ్ కి పూర్తి మద్దతిస్తా అంటూ లక్ష్మీ తన పోస్ట్‌లో పేర్కొంది.
అయితే, మంచు లక్ష్మి పోస్టుపై సుశాంత్ మేనకోడలు మల్లికా సింగ్.. ఆశ్చర్యంగా ఉంది, సినీ కుటుంబం, సహా నటులు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఇంతకముందు ఏమయ్యారో అంటూ మల్లికా రాసుకొచ్చింది. దీనికి సుశాంత్ సోదరి శ్వేతా ఇది నిజం అని బదులిచ్చింది.
రియా తల్లిదండ్రులకు సీబీఐ సమన్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి ప్రస్తుతం సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుండి రియాని అనేక కోణాలలో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు సీబీఐ అధికారులు. అయితే తాజాగా రియా తల్లిదండ్రులకి కూడా సీబీఐ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తుంది.
sushanth singh
రియా తల్లిదండ్రులు ఇంద్రజిత్ మరియు సంధ్య చక్రవర్తితో పాటు సోదరుడు షోయిక్ చక్రవర్తి ఈ రోజు విచారణలో పాల్గొనాలని సీబీఐ ఆదేశించింది. దీంతో కొద్ది సేపటి క్రితం వారు డీఆర్‌డీఓ ఆఫీసుకి చేరుకున్నట్టు తెలుస్తుంది. రియా తల్లిదండ్రులతో పాటు సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పిథాని, మేనేజర్ శామ్యూల్ మిరాండా, శ్రుతి మోడీ, కుక్ నీరజ్ సింగ్, కేశవ్ మరియు అకౌంటెంట్ రజత్ మేవతిలను కూడా సిబిఐ ప్రశ్నిస్తోంది.