సినీ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది వైఖరి కారణంగా తాను తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ట్వీట్ చేశారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
తన లగేజ్ బ్యాక్‌ను పక్కకు తోసేశారని బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదనీ, వాళ్లు చెప్పినవిధంగా చేయకపోతే గోవాలోనే తన లగేజీని వదిలేస్తామని బెదిరించారని, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. ఇదొక రకమైన వేధింపేనని తన కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని చెప్పారు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు.