Kerala: రిపబ్లిక్ డే పరేడ్- కుప్పకూలిపోయిన పోలీస్ కమిషనర్ (video)

సెల్వి

సోమవారం, 27 జనవరి 2025 (11:11 IST)
police
గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఛాతీలో విపరీతంగా నొప్పి, చెయ్యి, కాళ్ల నొప్పి, ఉదరం పైభాగంలో కనిపించే నొప్పి, వాంతులు, పంటినొప్పి, ఊపిరాడనట్టు ఉండటం, మెడపై ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన అతని సహచరులు అంబులెన్స్‌‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

City Police Commissioner Thomson Jose sir fainted during @KeralaGovernor Republic day's speech , rest for 2-3 days sir, if needed consult a Doctor ❤️@TheKeralaPolice#NambiarAdarshNarayananPV #KeralaGovernor #RepublicDay2025 #RepublicDayIndia #RajendraVishwanathArlekar #GWS pic.twitter.com/ckeWPACwT6

— Nambiar Adarsh Narayanan P V (@NaAdarshNaPV) January 26, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు