టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని 12 పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి వెల్లడించారు. నెల్లూరు నగరంలోని కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ నందు మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కోడలు శృతి రెడ్డిలతో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్ లను ప్రారంభించి..అక్కడి విద్యార్థులతో మమేకమై ఉన్నత విద్యకు తగిన ప్రాముఖ్యతను వివరించారు.