మోహన్ బాబు క్లాప్‌తో ప్రారంభమైన విష్ణు మంచు 'లక్కున్నోడు'

ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (15:55 IST)
'ఈడోరకం - ఆడోరకం' వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్‌గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా 'లక్కున్నోడు' చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. 
 
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. స్క్రిప్టును దర్శకుడికి అందించి, యూనిట్ సభ్యులను అభినందించారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ... లవ్ అండ్ కామెడి ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న మా లక్కున్నోడు చిత్రం మంచు మోహన్ బాబు చేతుల మీదుగా ప్రారంభంకావడం ఆనందంగా ఉంది. ఆయన మా టీంకు ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. 
 
గీతాంజలి, త్రిపుర వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా లక్కున్నోడు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను డైమండ్ రత్నబాబు అందిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 
 
దేనికైనా రెఢీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. 
 
తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్. 

వెబ్దునియా పై చదవండి